IND Vs NZ : Rohit Sharma ఆగ్రహానికి బలైన Rishabh Pant || Oneindia Telugu

2021-11-20 1

Delight for Rohit Sharma and his team as they take an unassailable 2-0 lead in the three-match series. Rohit and Rahul struck fifties and Rishabh finished with a flourish as India registered a 7-wicket win over New Zealand. During the match rohit sharma fired on rishabh pant.
#INDVsNZ
#RohitSharma
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#VenkateshIyer
#TrentBoult
#TimSouthee
#DeepakChahar
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ రెండింతల ప్రతీకారం తీర్చుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన భారత్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా కనిపించాడు. ఓ సందర్భంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ఫైర్ అయ్యాడు. వికెట్ల వెనుకాల అలసత్వంగా ఉన్న పంత్‌ను హిట్‌మ్యాన్ తిట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది.